ఉత్తర, దక్షిణ దేశం అంటూ విభజించే కుట్రలను సహించేది లేదు: ప్రధాని మోదీ హెచ్చరిక

07-02-2024 Wed 16:11 | National
Advertisement
  • కొంతమంది మా రాష్ట్రం మా పన్నులు అని మాట్లాడుతున్నారు... ఇదే వితండవాదమని ఆగ్రహం
  • నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే... బొగ్గు మా వద్దనే ఉన్నది కాబట్టి మేమే వాడుకుంటామంటే ఎలా? అని ప్రశ్న
  • వికసిత్ భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్న ప్రధాని
  • ఇండియా అంటే ఢిల్లీ మాత్రమే కాదు... చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా అన్న మోదీ
Advertisement
కొందరు ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని... ఇలా దేశాన్ని విభజించే కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. ఉత్తరాది... దక్షిణాది... మా రాష్ట్రం మా పన్నులు అంటూ వ్యాఖ్యానిస్తున్న ఆయా రాష్ట్రాల నాయకులపై మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది మా రాష్ట్రం మా పన్నులు అంటూ మాట్లాడుతున్నారని... అసలు ఇదేం వితండవాదం? అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదన్నారు. వికసిత్ భారత్ కోసం మోదీ 3.0 అవసరమన్నారు.

ఉత్తరాది... దక్షిణాది అంటూ నిధుల పంపిణీపై కొంతమంది నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో ఎలాంటి సంకుచితతత్త్వం లేదని... పారదర్శకంగా ఉంటామన్నారు. రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. అన్ని ప్రాంతాలను తాము సమానంగా చూస్తామన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కాస్త ఎక్కువ నిధులు అవసరమవుతాయని గుర్తించాలని హితవు పలికారు. నది మా రాష్ట్రంలో ప్రవహిస్తోంది కాబట్టి మాకే... బొగ్గు మా వద్దనే ఉన్నది కాబట్టి మేమే వాడుకుంటాం... మా రాష్ట్రం మా పన్నులు... ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించారు.

ఇండియా అంటే ఢిల్లీ మాత్రమే కాదు... చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా

ఇండియా అంటే ఢిల్లీ ఒక్కటే కాదని ప్రధాని మోదీ అన్నారు. నా దేశం అంటే ఢిల్లీ మాత్రమే కాదు... బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అన్నారు. దేశం అంటే మట్టి కాదని... మన ఐక్యతకు చిహ్నమని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాలు ఒక్క అడుగు వేస్తే తాము రెండు అడుగులు వేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఓడినా మనం మాత్రమే గెలిచామని గర్వంగా చెప్పారు. కరోనా సమయంలో తాను ముఖ్యమంత్రులతో 20సార్లు సమావేశమయ్యానని గుర్తు చేశారు.

యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్‌గా మిగిలింది

యువరాజు స్టార్టప్ నాన్ స్టార్టప్‌గా మిగిలిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఇప్పటికీ విజయవంతంగా లాంచ్ చేయలేకపోయారని చురక అంటించారు. యూపీఏ హయాంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కేంద్రమంత్రులను కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేశారని ధ్వజమత్తారు.
Advertisement
Narendra ModiCongressBJP

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more